లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్ వసంత పంచమి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట లోని లిటిల్ స్టార్ గ్రామస్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి పర్వదిన పురస్కరించుకుని లిటిల్ స్టార్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేయించుకున్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ,మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమి జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు.ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు.ఈ బుధవారం రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను.రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు (వసంతుడు)సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను.అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్, మినుముల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking