జన్వాడ క్రైస్తవుల పై అక్రమ దాడి సమంజసం కాదు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్ మండల కేంద్రము లో
బీఎస్పీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్
అడ్వకేట్ జగన్ మోహన్ మీడియాతో మాట్లాడుతు.
చేవెళ్ల నియోజకవర్గంలోని జన్వాడ గ్రామ క్రైస్తవులపై, చర్చిపై జరిగిన దాడి జరిగిన వారిని పరామర్శించుటకై జన్వాడ గ్రామనికి వెల్లిన బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, ఈ అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని, సర్వసత్తాక సార్వభౌమ, లౌకిక భారతదేశంలో మతపరమైనటువంటి ఘర్షణలకు తావు తీస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయంసేవక్ దల్ (ఆర్ఎస్ఎస్) ల వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నమని, బహుజన్ సమాజ్ పార్టీ,నిర్మల్ ఇంచార్జీ జగన్ మోహన్ అన్నారు.
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెంటనే విడుదల చేయలని లేని పక్షంలో రాష్ట్ర మొత్తం నిరసనలు,ఆందోళనలు చేపట్టి కాంగ్రెస్ బిజెపిల చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తామని, ప్రజా ప్రభుత్వమని మతసామరస్యాన్ని దెబ్బతీయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ పరిరక్షించుటకు బహుజనవాదులు,పూలే అంబేద్కర్ వాదులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.