ఖచ్చిత‌త్వంతో పశుగణన న‌మోదు చేపట్టాలి. ప‌శు గ‌ణ‌నకు ప్రజలు సహకరించాలి:: జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా అక్టోబర్ 29 :

జిల్లాలో అత్యంత ఖచ్చిత‌త్వంతో పశు గ‌ణాంకాల న‌మోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ప‌శు గ‌ణ‌న వాల్‌పోస్ట‌ర్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క శాఖ అధికారి కె. కొమురయ్య తొ కలసి ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేటి నుంచి నాలుగు నెల‌ల పాటు (29 ఫిబ్రవరి 2025 వరకు) 21వ జాతీయ ప‌శు గ‌ణ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రుగుతున్నద‌ని, ఇందుకోసం. జిల్లాలో 28 మంది ప‌శుగ‌ణ‌న‌క‌ర్త‌లు, 9 మంది ప‌ర్య‌వేక్ష‌కుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. జిల్లాలోని 9 మండలాలు 336 రెవెన్యూ గ్రామాల్లో ప‌శు గ‌ణ‌న జ‌రుగుతుంద‌న్నారు.
జిల్లాలోని 99459 మంది కుటుంబాల‌ను స‌ర్వేచేసి గేదెలు, ఆవులు, కోళ్లు, గొర్రెలు, మేక‌లు ఇలా 16 ర‌కాల ప‌శువులు, జీవాల సంఖ్య‌ను లెక్కించి, యాప్‌లో న‌మోదు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప‌శు గ‌ణ‌న ఆధారంగా నిధుల‌తో పాటు వ్యాధినిరోధ‌క టీకాలు, న‌ట్ట‌ల వ్యాధి నివార‌ణ మందులు వంటివి స‌ర‌ఫ‌రా అవుతాయ‌ని ఈ నేప‌థ్యంలో ప్రజలు,రైతులు గ‌ణ‌న‌క‌ర్త‌ల‌కు సహకరిస్తూ క‌చ్చిత‌మైన వివ‌రాలు అందించాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నరసింహ, డాక్టర్ బీ.నవత, పశు వైద్యాధికారులు, జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking