జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : రైతులకు పశు పోషకులు తమ పశు సంపదలను గాలికుంటు వ్యాధి నుండి రక్షించుకోవాలని, పశువులకు సకాలంలో టీకాలు వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పశు సవర్ణ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వై రమేష్ తో కలిసి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సంబంధిత గోడ పత్రాలు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గాలి కొంటు వ్యాధి వలన తీవ్రమైన జ్వరం పాడి పశువులతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం పున ఉత్పత్తి పని సామర్థ్యం తగ్గడం జరుగుతుందని,మార్చి, ఏప్రిల్,ఆగస్టు,సెప్టెంబర్, మాసాలలో ఎక్కువ ఈ వ్యాధి వస్తుందని,3 నెలలు పై బడిన అన్ని గోజాతీ,గేదెజాతి, పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు.టీకాలు సురక్షి తమైనవి,టీకాలు వేసిన ప్రతి పశువు గుర్తింపు చనిపోవు వేసి వివరణ భారత్ పశుదాన్ యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పశువుల పాలకులను శుభ్రంగా ఉంచాలని,4 నెలల వయసు దాటిన దూడలకు, చూడి పశువులకు 6 నెలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని,వ్యాధి సోకిన పశువులకు వేరుచేసి వుండ్లను పోటాషియం పర్మాంగనేట్ దవనంతో కడిగి నోటి పుండ్లుకు బోరోగ్లిసరిన్ పూయారిని,వెంటనే సమీప పశు వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గాలి కొంటు వ్యాధి నిరోధక టీకాలను రైతులు,పశు పోషణకులు సద్వినియోగం చేసుకొని తమ పశువులకు తప్పని సరిగా టీకాలు ఇప్పించాలని తెలుపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి సెక్షన్ పర్యవేక్షకులు సంతోష్,పశు అధికారులు,సంబంధించిన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.