మహశివరాత్రి వేడుకలో
గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, కట్టంగూర్ మండల కేంద్రంలోని శివాలయంలో స్వామి వారిని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
