జోరుగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

 

కాంగ్రెస్‌ అధికారంలోకి రైతు భరోసా కింద ఏటా రూ. 15 వేలు

వ్యవసాయ కూలీలకు రూ‌‌.12 వేలు, వరి పంటకు రూ. 500 బోనస్

రూ. 4 వేల ఫించన్, మహిళలకు ఉచిత ప్రయాణం

ప్రతి నిరుపేదకు ఇంటిస్థలంతోపాటు రూ. 5 లక్షలు

పిల్లల చదువులకు ఐదు లక్షల రూపాయాల బ్యాంకు గ్యారంటీ కార్డు

ఆడబిడ్డలందరికీ ప్రతి నెల 1వ తేదీన రూ. 2500 లు.. గ్యాస్ సిలిండర్ రూ. 500లకే

కల్యాణలక్ష్మీ కింద ఒక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్ చౌదరి

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

మెదక్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని ర్యాలమడుగు, జానకంపల్లి, చిట్యాల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హఫీజ్ మోల్సాబ్ తో కలిసి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో లోని ఆరు గ్యారంటీలను అమలును ఇంటింటికి తీసుకెళ్లి ప్రతిఒక్కరికి తెలియపర్చి టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యమన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగ ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశామని ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ప్రతి కింద ఏటా రైతు, కౌలు రైతులకు రూ. 15 వేలు తోపాటు వ్యవసాయ కూలీలకు రూ‌‌.12 వేలు, వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. అలాగే ఫించన్ రూ. 4 వేలు, ఆడబిడ్డలందరికీ ప్రతి నెల 1వ తేదీన రూ. 2500 ఇస్తామని, మహిళలు ఉచితంగా ఆర్టీసి బస్సులలో ప్రయాణించవచ్చునని అన్నారు. కల్యాణలక్ష్మీ పథకంలో భాగం గా ఒక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటిస్థలంతో పాటు ఐదు లక్షల రూపాయాలను ఇస్తామని, పిల్లల చదువులకు ఐదు లక్షల రూపాయాల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇస్తామని అన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో… మాజీ సర్పంచ్ బోయిని ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శేషు కుమార్, వరిగుంతం చింటూ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సభ్యులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking