బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు పార్లమెంటులో పోరాడుతాం ఎంపీ రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ పార్లమెంటులో పోరాడుతుందని, మహిళా బిల్లు ఆమోదం పొందడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన 10 రోజుల్లోనే మహిళలు బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగి అన్ని రాజకీయ పక్షాల మద్దతును కూడగట్టారని వివరించారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన స్పూర్తితో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మహానేత కేసీఆర్ మార్గదర్శనంలో పోరాడుతామని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం లోకి రావడం, కేసీఆర్ తిరిగి సీఎం అయ్యి,ఆ తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం తథ్యమని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.మున్నూరుకాపులందరం కూడా మరింత ఐకమత్యంతో ముందుకు సాగుదామని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి ఉప్పల వెంకటరమణ ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల శ్రీనివాసరావు, తాడేపల్లి రవి,మద్దాల నాగేశ్వరరావు,జ్యోతి దర్గయ్య,సుంకర రామారావు,బొల్లేపల్లి నాగరాజు,అంచె కృష్ణ, భీమా శ్రీధర్, చిన్నంశెట్టి రాంబాబు,భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించారు.