2020 సంవత్సరంలో అనధికార లే
ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి సువర్ణ అవకాశం.
ఈ నెల 31వ తేదీలోగా ఫీజు చెల్లిస్తే
25% రాయితీ.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ప్రజాబలం ప్రతినిధి
తేది.19.3.2025.
ములుగు జిల్లా.
అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణకు,
ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు 2020 సంవత్సరంలో ఎల్.ఆర్.ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించుటకు రాష్ట్ర ప్రభుత్వం
కల్పించిన 25 శాతం రాయితీ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుందని, ఎఫ్.టి.ఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్.ఆర్.ఎస్ 2020 కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించామని తెలిపారు.
రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి పరిశీలించవచ్చని అన్నారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఎవరైనా ఈనెల 31వ తేదీ లోగా చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. రుసుము చెల్లించిన వారి దరఖాస్తు అధికారులు పరిశీలించి
రెండు రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. అనధికారికంగా లేఅవుట్లు చేసి అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని అన్నారు.
ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్.ఆర్.ఎస్ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు.
క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్దీకరణ చేసుకోవాలని, ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.