ఒకేరోజు రికార్డు స్ధాయిలో 646 టన్నుల బొగ్గు ఉత్పత్తి

 

-కాసిపేట – 2 గని సిబ్బందికి అభినందనలు

-గని మేనేజర్ గొడిసెల లక్ష్మీనారాయణ

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 19:

కాసిపేట-2 ఇంక్లైన్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని రచిస్తూ బుధవారం ఒకే రోజు 646 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి తద్వారా ఉత్పత్తి మైలురాయిలో మరో అద్భుతమైన విజయాన్ని అందుకొని కాసిపేట్-2 ఇంక్లైన్ ఉత్పత్తి చరిత్రను తిరగరాశమని గని మేనేజర్ గొడిసెల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది నిజంగా అంతులేని కృషి, సామూహిక శక్తి, అంకితభావానికి నిలువుటద్దమన్నారు. ఈ మైలురాయిని అందుకోవడం ద్వారా మీరు చూపిన పట్టుదల, సరైన ప్రణాళిక మరియు సంకల్పబలం అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. మీ కృషి వల్ల మన కాసిపేట్-2 ఇంక్లైన్ కు నూతన పథాలను ఏర్పరచిందన్నారు. మన అందరి కృషి వల్లే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉన్నతమైన లక్ష్యాలను చేరుకునేందుకు ముందుకు సాగుదామన్నారు. మనమంతా కలసి కృషి చేస్తే, ప్రతి కల సాకారం అవుతుందని మరిన్ని చరిత్రాత్మక విజయాలను సాధించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విజయంలో భాగమైన అధికారులకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, ఉద్యోగులకు, యూనియన్ నాయకులకు నా హృయపూర్వక అభినందనలు అని మేనేజర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking