హైదరాబాద్ జూలై 19 ( );ఆంధ్ర ప్రదేశ్ బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రదాన కార్య దర్శి గా తాడేపల్లి గూడెం కు చెందిన ఎం.లలిత కుమారి నియమితులైనారు. ఈ మేరకు బిసి భవన్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. లలిత కుమారి సాంఘిక,సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తాడేపల్లి గూడెం లో తన కంటూ గుర్తింపు పొందారు. అంతే కాకుండా 2011 క్రియా శీల రాజకీయాల్లో ప్రవేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో జిల్లా, మండల స్థాయి లో పలు పదవులను నిర్వహించి పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానాన్ని చూరగొన్నారు. లలిత కుమారి సేవా కార్యక్రమాలను, పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలను గుర్తించిన ఆర్. కృష్ణయ్య ఆమెను ఆంధ్ర ప్రదేశ్ బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రదాన కార్య దర్శి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.పార్టీ పరంగా కాకుండా బిసి లు ముఖ్యంగా బిసి మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.అనంతరం లలిత కుమారి మాట్లడుతూ రాష్ట్రము లో బిసి మహిళల సమస్యల పరిష్కారం కోసం తనవతు కృషి చేస్తానన్నారు.తనపై గల నమ్మకం తో తనకు ఆంధ్ర ప్రదేశ్ బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రదాన కార్య దర్శి గా నియమించి నందులకు ఆమె ఆర్. కృష్ణయ్య కు కృతఙ్ఞతలు తెలిపారు.