ప్రభుత్వ సంరక్షణలో ఉన్న భూమిని భూ యజమానులకు అప్పజెప్పాలి న్యాయవాది షేక్ జిలాని

సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ లోని సర్వే నెంబర్ 7లో
ప్రభుత్వ సంరక్షణలో ఉన్న భూమిని భూ యజమానులకు అప్పజెప్పాలని,రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయాలని భూ యజమాని వారసుడు ఎండి యూసుఫ్ ఖాన్ న్యాయవాది షేక్ జిలాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆ భూమిని యజమానులు 100 గజాల చొప్పున సుమారు 50 వేల మంది నిరుపేదలు, దివ్యాంగులకు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన న్యాయవాది సునీల్ babuతో కలిసి మాట్లాడారు.సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ లోని సర్వే నంబర్ 1 నుంచి 14, 15 నుంచి 20 వరకు ఉన్న సుమారు 2400 ఎకరాలకు పైగా భూమి హనీఫా బీకి చెందిందన్నారు.ఆమె మృతి చెందిన తరువాత ఆమె కూతురు అఫ్జల్ సుల్తానాకు,తరువాత ఆమె కుమారుడు ఎండి యూసుఫ్ ఖాన్ కు చెందుతుందన్నారు.ఈ భూమి వారికి వారసత్వంగా వచ్చిందన్నారు.1947 సంవత్సరం లో హనీఫా బీ భూమిని ప్రభుత్వ సంరక్షణ నిమిత్తం ఇచ్చిందని, ప్రభుత్వం 1954లో 25 సంవత్సరాల లీజుకు అటవీశాఖకు ఇచ్చిందన్నారు.1979లో లీజు గడువు ముగిసినా భూమి ఇంకా అటవీశాఖ అధీనంలోనే ఉందని, వారు భూమి చుట్టూ గోడ కట్టారన్నారు.
యూసుఫ్ ఖాన్, అతని భార్య వాసం తులసమ్మలు 2010లో ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.రెవెన్యూ,సర్వే విభాగానికి చెందిన అధికారులతో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే చేయించడం జరిగిందన్నారు.సర్వే నెంబర్ 7లోని 2400 ఏకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు, దివ్యాంగులకు ఒక్కోక్కరి 100 గజాల చొప్పున రాసిచ్చారన్నారు.వారందరూ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ భూమిని భూ యజమాని వారసుడు యూసుఫ్ ఖాన్ కు అప్పగించాలని కోరారు.సమావేశంలో షేక్ ఏజ్దాని బాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking