చేగుంట,తూప్రాన్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

 

పశుగ్రాసం దానం చేసి ఉదారత చాటిన లయన్ దాసోజు వీరబ్రహ్మం

నాగులపల్లి బ్రహ్మంగారి మఠం గోశాలలో మందులు, పౌష్టికాహారం పంపిణీ

తూప్రాన్, జులై, 18.

ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులని, వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమయినవని చేగుంట లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ దాసోజు వీరబ్రహ్మం అన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులోని బ్రహ్మంగారి మఠం గోశాలలో చేగుంట, తూప్రాన్ లయన్స్ క్లబ్స్ ట్విన్నింగ్ లో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 5,500 రూపాయల విలువ చేసే ఎండు గడ్డి పశుగ్రాసం ను దానం చేశారు. అలాగే అవులకు పౌష్టికాహారం, మందులు పంపిణీ చేశారు. అనంతరం అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ డి. లింగమూర్తి మాట్లాడుతూ ఎద్దులు వ్యవసాయ దారునికి ఎంతో ఉపయోగపడతాయని, వీటిని భూమి దున్నడానికి, బండి తోల డానికి ఇలా అనేక వ్యవసాయ పనులకు వినియోగిస్తారని తెలిపారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయ వీలుండేది కాదన్నారు. ప్రస్తుతం యంత్రాలోచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయన్నారు. హిందువులకు ఆవు ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయన్నారు. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేద, మూత్రం లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం: ఆహారంగానే కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం. ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత అర్క్ చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనే మాటనే. భారత దేశానికి రైతు వెన్నుముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతుకు భూమి లేక పోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా బతగ్గలడు. ఆవుకు పుట్టిన కోడెలు (ఎద్దులు) రైతుల భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేర వేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండ దండగా వుంటాయి. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాదిస్తాడు, పోషిస్తాడు. తమ పిల్లలు లాగా కాపాడు కుంటాడు. ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాసు ఉత్పత్తి చేసి వంట చెరుకుగా వాడు కుంటాడు. మిగిలిన వ్వర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడు కుంటాడు. చివరకు ఆవు చనిపోయిన తర్వాత కూడా దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మనిషికన్నా ఆవే గొప్ప. ఈ విషయాన్ని ఆవు స్వగతంలో చెప్పుతున్నట్లు ఒక సినిమా పాట ఉంది. వినరా.. వినరా…. నరుడా తెలుసు కోరా పామరుడా…… గోమాతను నేనేరా నాతో సరిపోలవురా ……… ఇలా ఆపాట చాల హృద్యంగా సాగుతుందని అన్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ ఇంతటి ప్రాశస్త్యం గలిగిన ఆవులు గతంలో మనదేశంలో చాల జాతులు వుండేవి. కాల క్రమేణ అవి చాల వరకు అంత రించి పోయాయి. ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది జాతులు మాత్రం మిగిలి వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆవులలో సంకర జాతులు, జర్సీ ఆవులు వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటి పై మక్కువ చూపు తున్నారు. ప్రభుత్వంకూడ వీటికి సరైన ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రస్తుతం అనేక మంది రైతులు ఇటు వంటి సంకర జాతి ఆవుల పెంపకంలో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. కాని ఔషధ సేవనలో, ఆచార వ్వవ హారాలకు, ఆరాధనా ప్రక్రియలలో దేశ వాళి ఆవులకు, వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత ఉంది. అందు చేత ఈ దేశ వాళి గోవులను, వాటి లుత్పత్తులను వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డా:బి.అర్.కే.ఆర్. ప్రభుత్య ఆయుర్వేద కళాశాల వారు, చరక డైరి వారు సంయుక్తంగా దేశ వాళి ఆవుల ఉత్సవాన్ని మూడు రోజుల పాటు హైదరాబాదులో నిర్వహించారన్నారు. వాటి ఉత్పత్తులను, ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారని. అదే విధంగా గోమాతకు ప్రధక్షిణం చేసే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ లయన్స్ క్లబ్ ట్రెజరర్ లయన్ పుట్ట డెకరేషన్ వెంకటేష్, చేగుంట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దుర్గం అనిల్ కుమార్,
లయన్ నాగరాజు, దాసోజు వీరబ్రహ్మం, లింగమూర్తి,పులబోయిన నాగరాజు,శంభుని శ్రీనివాస్, బుర్కా నాగరాజు,కె. సురేష్ గారు, భోగరాజు, కంది రమేష్, దాత్రిక శ్రీనివాస్..మల్లేష్
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking