విద్యుత్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఎం.ప్రసాద్

 

ఖమ్మం ప్రతినిది జనవరి 06 (ప్రజాబలం) తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ ఎన్నికలు సిద్దిపేటలో 4.5 తేదీలలో. జరిగినాయి . ఈ మా మహాసభలలో ఖమ్మం కు చెందిన ఎం. ప్రసాద్ ను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది . ప్రసాద్ విద్యుత్ శాఖ లో వివిధ పదవులు చేసి ఇప్పుడు రాష్ట్రస్థాయి పదవికి ఎంపికయ్యారు . గతంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా , జిల్లా ఉపాధ్యక్షుడిగా , కంపెనీ కార్యదర్శిగా మూడు దఫాలుగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు గత 25 సంవత్సరాల నుండి కార్మిక ఉద్యోగుల సమస్యల కోసం హక్కుల కోసం అహర్నిశము పనిచేస్తూ అనేక ఉద్యమాలు నిర్మిస్తూ ఖమ్మం జిల్లాలో యూనియన్ బలోపేతానికి తన వంతుగా కృషి చేసి , కంపెనీ స్థాయి 16 జిల్లాల ప్రధాన కార్యదర్శిగా ఎంపికై మూడు దఫాలుగా పనిచేసి , ప్రస్తుతము రాష్ట్రస్థాయి పదవికి ఎంపిక అయినారు . ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ అనేక కార్మిక ఉద్యమాలు నిర్మించి వాటిలో విజయం సాధించాన వాటిలో ప్రధానమైనవి సబ్స్టేషన్ల లో పనిచేసే కార్మికులను జేఎల్ఎంలుగా నియమించే దానిలో , టీ టఫ్ ఏర్పడి సబ్ స్టేషన్ కార్మికులను సంస్థలో విలీనం చేసిన పోరాటంలోనూ , వేతన ఒప్పంద సమయంలో అధిక వేతనాలు సాధించటం , అన్ మేన్ కార్మికులకు స్కిల్ వేతనాలు సాధించే పోరాటంలోనూ , పీస్ రేట్ కార్మికులకు జీతాలు పెంపుదల లోను , సంస్థలు కార్మికులకు కనీస వేతనాలు , ఈపీఎఫ్ సాధించే పోరాటాలలోను , విస్తృతంగా కార్మికులను ఐక్యము చేసి చైతన్యపరిచే అనేక ఉద్యమాలు నిర్మించి , మెరుగైన వేతనాలు ఇప్పించడానికి విశేష కృషి చేసినారు . జిల్లా స్థాయిలోనూ కంపెనీ స్తాయి వరంగల్ లోనూ హైదరాబాదులో నూ జరిగే పోరాటాలకి విశేష కృషి జరిపినారు .

తన సేవలకు గుర్తింపుగా ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్ష పదవి కి ఎంపిక అయినారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు హక్కులు కల్పించడంలో విఫలమైన సందర్భాలలో ఆర్టీసీ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పోరాటాలలోను తమ సహకారాన్ని అందజేసినారు . అంతేగాక విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో, కార్మిక సంక్షేమ కార్యక్రమాలలోనూ, వివిధ స్థాయిలలో అధికారులతో చర్చలు జరపటం లోను సమస్యలు పరిష్కరించడంలోనూ ఇతర యూనియన్ లతో కలిసి ఐక్య పోరాటాలలో ను కీలక పాత్ర పోషిస్తూ , ఎంపీడీసీఎల్ లో ప్రమోషన్లు సాధించటం లోను , ట్రాన్స్ఫర్స్ ఒక క్రమబద్ధంగా జరపడానికి యాజమాన్యాన్ని ఒప్పించి విజయం సాధించారు . కార్మిక సంక్షేమ పథకాలైన కోటి రూపాయల బీమా , ట్రస్ట్ ఏర్పాటు విషయంలోనూ, ఇన్సూరెన్స్ సంబంధించి అనేక విషయాలలో యాజమాన్యంతో చర్చలు జరిపింది వాటికి అమలకు విశేష కృషి చేసినారు . బాధ్యత పెరిగినది ఎం ప్రసాద్ ప్రస్తుత రాష్ట్రస్థాయి ఉపాధ్యక్ష పదవిలో ఉండటం వల్ల ఇటు ఖమ్మం , వరంగల్ తెలంగాణ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్మించి ఆర్టిజన్ కన్వర్షన్ లోను , పీసు రేటు కార్మికులకు కనీస వేతనాలు ఇప్పించడానికి , విద్యుత్ శాఖలో అందరికీ పెన్షన్ డిమాండ్ తో పాటు రాబోయే రోజులలో కార్మికులను ఉద్యోగులను చైతన్య పరుస్తూ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కావలసిన కార్యాచరణ ప్రణాళికలు చేయవలసిన బాధ్యత ఉందని , ఈ సమస్యలు పరిష్కారం వరకు తను అవిశ్రాంతంగా పనిచేయవలసి ఉందని తెలియజేశారు . ఈ కమిటీకి ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీకి , ఎల్లవేళలా అండదండలుగా ఉంటున్న కార్మిక , ఉద్యోగ , ఉన్నతాధికారులకు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి , పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking