గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 21 (ప్రజాబలం) ఖమ్మం సుగ్గుల వారి తోట , పాత శివాలయం పక్కన శివ గణేష్ ఉత్సవ కమిటీ ( 26 వార్షికోత్సవం ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పల్లా కిరణ్ కుమార్ సహాయ సహకారాలతో మహా అన్న దాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ మహా అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 2000 మంది వరకు భక్తులు పాల్గొని మండ పంలో ఉన్న వినాయకుని దర్శించుకుని భోజనం చేశారు ఈ సందర్భంగా పల్లా కిరణ్ కుమార్ మాట్లాడుతూ విఘ్నేశ్వరి కృప ఎల్లవేళలో ప్రజలందరిపై ఉండి సిరి సంపదలతో ఆయు రారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు ఈ కార్యక్రమంలో శివ గణేష్ ఉత్సవ కమిటీ ముఖ్యులు సాంబ , జగన్ , రవి , నరేష్ , ప్రణయ్ , సాయి , గిరీష్ , ప్రతాప్ , చంటి , సందీప్ , హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking