పండితాపురం జాతరలో మహా అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన తుంబూరు దయాకర్ రెడ్డి పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ రాయల నాగేశ్వరావు
ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం లో జరుగుతున్న జాతర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి, ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి, కారేపల్లి సిఐ తిరుపతి రెడ్డి, కామేపల్లి ఎస్సై ప్రవీణ్ రెడ్డిజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులుపోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడెపుడి విఠల్ రావు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి కొమ్మి నేపల్లి కొండాయిగూడెం పండితాపురం భక్త బృందం ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి సత్కరించారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరుగు జాతర కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనున్న సందర్భంగా జాతరలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ బోడెపుడి విఠల్ రావు తన సొంత ఖర్చులతో, వితరణతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేసి ప్రశాంతంగా జరిపారు. ఈ దైవ సన్నిధిలో ఎలాంటి గొడవలు కాకుండా ప్రశాంతంగా స్వామి వారి కళ్యాణం జరుపుకోవాలని, ఏసిపి తిరుపతిరెడ్డి సూచించారు . దగ్గరుండి మల్లి బాబు యాదవ్ పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు నరసింహ నాయక్, మేకల మల్లికార్జునరావు, మేకపోతుల మహేష్, ధరావత్ అనురాధ, తోటకూరి భద్రయ్య చల్ల మల్లయ్య జక్కంపూడి వెంకటేశ్వర్లు, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాద్, అంబడిపూడి వెంకటేశ్వర్లు,దొడ్ల వేణు, తొండల ముత్తయ్య బండి లక్ష్మీ నర్సు, బండి ఉపేందర్, మేకల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు
