లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్,ఎస్సై పి చంద్ర కూమారు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని,పట్టణంలోని నేషనల్ హైవే 63 వెళుతున్న కారణంగా భూములు కోల్పోయిన సంబంధిత రైతులతో లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్,ఎస్సై పి చంద్రకుమార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 గ్రామాల రైతుతో సమావేశం నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా సీఐ,ఎస్సై,లు మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని 6 గ్రామాల రైతులతో,పోతేపల్లి,గుల్లకోట, సూరారం,మిట్టపల్లి, లక్షెట్టిపేట పట్టణ లోని మోదేల, ఇటిక్యాల,గ్రామాలకు, పట్టణానికి,చెందిన రైతుల యొక్క పొలాల గుండా నేషనల్ హైవే 63 వెళుతున్న కారణంగా భూములు కోల్పోతున్న 6 గ్రామాల రైతులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.దానిలో భాగంగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్,అదేవిధంగా పదో తరగతి పరీక్షలు దృష్ట్యా సాధారణ ప్రజలకు మరియు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, ఏర్పడకుండా కొందరు ముఖ్య రైతుతో రోడ్ల పైన ఎలాంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని చేపట్టవద్దని,వారు చేసే నిరసన కార్యక్రమాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని వారికి సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దాదాపుగా 20 మంది రైతులు పాల్గొనటం జరిగింది.