కెమెరా కళ్ళకు రాష్ట్రస్థాయి అవార్డు.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 20

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో “కెమెరా ఐస్” పేరిట, హైదరాబాద్ కేబిఆర్ పార్కులో బుధవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన ఫోటో గ్రాఫర్ విజయగిరి రాంబాబు ద్వితీయ బహుమతి అందుకున్నారు. అటవీ సంపద,వన్యప్రాణులు, పక్షులు,తదితరాలను తన కెమెరాలో అద్భుతంగా నిక్షిప్తం చేసినందుకుగాను,ఈ అవార్డు ప్రధానం చేశారు.అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎంసీపర్గెన్, కన్జర్వేటర్ ఎం శివాని డోగ్రా తదితరులు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా, పలువురు ఫోటోగ్రాఫర్ రాంబాబును అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking