మానవత్వం చాటుకున్న వోడితెల ప్రణవ్.

 

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 20

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన దక్షిణామూర్తి అనే వ్యాపార అవసరాల నిమిత్తం హుజురాబాద్ పట్టణానికి వచ్చి తిరిగి తన గ్రామానికి బైక్ పై వెళ్తున్నక్రమంలో బైక్ పై నుండి క్రింద పడి తలకు తీవ్ర గాయల పాలై రోడ్డు పై పడి ఉండగా సింగపూర్ నుండి హుజురాబాద్ వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితేల ప్రణవ్ గాయపడిన వ్యక్తిని చూసి హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన కి ఆటో లో తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన వైద్యులకు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తి ని దవాఖాన కి పంపిస్తున్నామని ఆయనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking