గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదానం

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 23:
అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శనివారం దేశయిపేట 80 ఫీట్ రోడ్ లోని గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండపంలో కొనువైన గణనాధునికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వర్తక సంఘం సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని దేవుడి సన్నిధిలో ప్రజలకు అన్న ప్రసాదాన్ని అందజేయడం తమకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అన్నారు. వినాయకుని దయతో తమ వ్యాపారాలు దినదినం అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోగణపతి వర్తక సంఘం సభ్యులు ఇప్పకేల శ్రీనివాస్ ,ఎడ్ల రాజు, సామంతుల సతీష్, చుంచు రాజు, వెలుగొండ రవీందర్, తవటం గోపి, రామగిరి మోహన్, నరేష్, మహేందర్, తిరుమల రమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking