మెదక్ టౌన్ 23/9/23
ఈరోజు కలెక్టరేట్ ఆఫీసులో మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం,చల్లా లక్ష్మణ్. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని, విద్యాశాఖ ఆదేశాల ప్రకారం మెడికల్ గ్రౌండ్, స్పౌస్ వాడుకునేలా ఆదేశాలు ఇవ్వాలని, బదిలీల, పదోన్నతుల సీనియార్టీ జాబితాలలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని,కోర్ట్ తీర్పుకు లోబడి భాషా పండిట్లకు, పిఇటీ లకు పదోన్నతులు ఇవ్వాలని,జాబితాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించాలని జిల్లా విద్యాధికారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ బాధ్యులు నరసింహులు నరేందర్ పాల్గొన్నారు