కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మహాధర్నా..
కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మహాధర్నా..
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రి అలోల ఇంద్రకరణ్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. అని బిజెపి నాయకులు మండిపడ్డారు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం మొన్న చేపట్టగా పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించి ధర్నాకు అనుమతులు లేవని తెలపడంతో భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించి ఈ యొక్క ధర్నాకు షరతులతో కూడిన అనుమతి తీసుకురావడం జరిగింది. అని బిజెపి నాయకులు అన్నారు ఒక మాస్టర్ ప్లాన్ నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ రైతులను, పట్టణ ప్రజలను నట్టేట ముంచే విధంగా ఉన్నది. పేద రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మంత్రి నిర్మల్ పట్టణంలో సోఫీ నగర్ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ ను వారి అనుచరులకు కేటాయించి దాన్ని కమర్షియల్ గా మార్చడం మంజులాపూర్ పరిధిలో పచ్చని పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడం రైతులకు శోకంగా మిగిలింది. కలెక్టర్ సమీకృత కార్యాలయం ప్రాంతంలో గ్రీన్ జోన్ ప్రాంతాన్ని తరలించి కమర్షియల్ రెసిడెన్సి జోనుగా మార్చడం పట్ల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు…ఈ కార్యక్రమానికి మంజులాపూర్ రైతులు మరియు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారికి మద్దతు తెలిపారు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నాని విజయవంతం చేయడం జరిగింది మరియు అనంతరం పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్ నేతృత్వంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిర్మల్ పట్టణ ప్రజల పక్షాన నిలబడి అండగా ఉంటుందని నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెడిసిమ్మె రాజు, రాజేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, న్యాయవాది అంజి కుమార్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి.జిల్లా ఉపాధ్యక్షులు కమల్నయన్ ,జిల్లా కార్యదర్శి శ్రీ గాదె విలాస్, కోరిపల్లి శ్రావణ్ రెడ్డి, దళిత మూర్ఛ జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్ నాయకులు ఒడిసెల శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్ కత్తి నరేందర్ ,సైన్ల శ్రీధర్, నాయకులు అమరవేణి నరస గౌడ్, భూపతిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ శ్రీరామోజు నరేష్, మండల అధ్యక్షులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు..