అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి..

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదులలో భాగంగా జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి గ్రీవెన్స్ సెల్ లో ఏర్పాటు చేసిన ప్రజవాణి లో అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లాఅధికారులను ఆదేశించారు.
ప్రజావాణి లో 15 దరఖాస్తులు వచ్చాయని, వీటిని తక్షణమే పరిష్కరించాలని తెలిపారు.
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి జిల్లా తో పాటు మండలాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ లు అందుబాటులో ఉండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్జీదారుని సమస్యలను పరిష్కరించాలని, మండలాల్లో పరిష్కారం కాని సమస్యలను జిల్లా లో పరిష్కారం కొరకు ప్రజావాణి లో పరిష్కరించుకోవాలని అన్నారు.
ప్రజావాణి లో అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking