వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 6:
తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ బిఆర్ఎస్ కార్మిక అనుబంధం విభాగానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభల్లో బాగంగా సోమవారం నదునూరి రాజేష్ కన్నా అధ్యక్షతన హన్మకొండ జిల్లా కమిటీ సమావేశం పబ్లిక్ గార్డెన్ లో జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు జిల్లా ఇన్చార్జి నాయిని రవి పర్యవేక్షణలో ఈ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఎంప్లాయిస్ యూనియన్ హనుమకొండ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా నద్దునూరి రాజేష్ కన్నా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ శెట్టి నరేందర్, కోశాధికారిగా పుల్ల పున్నం చందర్, తో పాటు 8 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు,30 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజులలో కార్మికుల పక్షాన నిలబడి ఉద్యోగాలు క్రమబద్ధీకరించే వరకు పోరాడుతూ సమాన పనికి సమాన వేతనం దక్కే
వరకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు,కార్మిక విభాగం కార్మికులు పాల్గొన్నారు.