మహత్మాగాంధీ జ్యోతిబా పూలే, బిసి వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్ కలెక్టర్ తనిఖీ

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 31:
శామీర్ పేట్ లోని అమీనా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న మహత్మాగాంధీ జ్యోతిబా పూలే, బిసి వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర) లో మౌళిక వసతులను కల్పించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
శనివారం శామీర్ పేట్ లోని మహత్మాగాంధీ జ్యోతిబా పూలే, బిసి వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర) ను కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ స్కూలులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని స్కూలు నిర్వహాకులను అడిగి తెలుసుకున్నారు. స్కూలులో అవసరమైన లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, టాయిలెట్ల కు అవసరమైన మరమ్మత్తులు చేయించాలని తెలిపారు. భోజన శాలలో టేబుల్లు, కుర్చీలు విద్యార్థులకు సరిపడా ఏర్పాటు చేయాలని, భోజన శాలకు వెళ్లే దారిని మొరం తో నింపాలని నిర్వహాకులకు కలెక్టరు సూచించారు. వీటికి అయ్యే ఖర్చులను యాజమాన్యానికి ఇచ్చే అద్దెలో 4,5 నెలల్లో కొంచెం కొంచెంగా మినహాయించాలని నిర్వాహాకులకు తెలిపారు. స్కూలులోని వంట శాలను, స్టోరురూంను కలియ తిరిగి పరిశీలించారు. స్టోరురూంలోని వంట సామాగ్రిని పరిశీలించి తడి లేకుండా సామాగ్రిని నిలువ ఉంచాలని కలెక్టరు స్టోర్ ఇంఛార్జిని ఆదేశించారు. తరగతి గదులను కలెక్టరు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. రెసిడెన్షియల్ స్కూలుకు వెళ్లే రహాదారి చాలా గుంతలతో ఉన్నదని, దానికి కావలసిన మరమ్మత్తులను చేపట్టాలని ఎంపిడిఓను కలెక్టర్ ఆదేశించారు.
ముందుగా విద్యార్థులు కలెక్టరుకు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో ఎంపిడిఓ మమతా బాయి,రెసిడెన్షియల్ స్కూలు నిర్వహాకులు, టీచర్లు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking