ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 31 : రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచల్మ గ్రామంలో గ్రామపంచాయతీ ఆఫీసు వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.శనివారం ఈ కంటి వైద్య శిబిరంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేసుకున్న వారిలో త్వరలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అధిక మంది సంఖ్యలో ప్రజలు, అధిక సంఖ్యలో వృద్ధులు శస్త్ర చికిత్స చేయించుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గౌడపు భీము,మాజీ వార్డ్ సభ్యుడు అప్పని తిరుపతి,శక్తి కేంద్రం ఇంచార్జ్ మల్యాల రమేష్,సీనియర్ నాయకుడు ఇష్ణవేణి వినోద్, కారుకూరి సుధాకర్,సీనియర్ సిటిజన్ సభ్యులు, బిజెపి గ్రామ సభ్యులు,వైద్య సిబ్బంది సభ్యులతో కలిసి పాల్గొని నిర్వహించడం జరిగింది.