వీ.ఆర్.4 ట్రస్టు సాంబర్ అన్నం, పెరుగు అన్నం వితరణ.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 31 ఆగస్టు 2024:
వీ.ఆర్.4 సహాయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రావణమాస శని త్రయోదశి సందర్భముగా మణికొండ పైప్ లైన్ రోడ్డు వీకర్ సెక్షన్ కాలనీ బస్ స్టాండ్ దగ్గరలోని లేబర్ అడ్డా వద్ద 100 పై చిలుకు మందికి సాంబర్ అన్నం మరియు పెరుగు అన్నం వితరణ గావించడం జరిగినదని, రాబోయే వినాయక విసర్జన సెప్టెంబర్ 15 ఆదివారం మరియు 17 మంగళవారం రోజులలో కూడా నెక్నంపూర్ చిన్న చెరువు విసర్జన గుండం వద్ద భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక గావిస్తున్నామని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ, నేటి కార్యక్రమంలో ట్రస్ట్ కోశాదికారి దిలీప్ కక్కడ్, సభ్యులు రచ్చా శ్రీనాథ్, తమ్మశట్టి రాజశేఖర్, రమ్యా గణపతి రాజు, సాయిచరణ్, శృతిచరణ్ తది తరులు పాల్గొన్నారని ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.

               

Leave A Reply

Your email address will not be published.

Breaking