బెస్ట్‌ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 77 వ వర్ధంతి కార్యక్రమం..

కక్కిరేణి గ్రామ పాశుద్ధ కార్మికులకు చిరు సత్కారం…
నకిరేకల్‌ ప్రజాబలం ప్రతినిధి:రామన్నపేట మండలంలో కక్కిరేణి గ్రామంలో ఈ రోజు , బెస్ట్‌ సేవా సొసైటీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 77 వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
జాతిపిత , శాంతి, అహింస, మానవసేవను ఆయుధాలుగా తీసుకుని స్వాతంత్య్ర సమరంలో విజయం సాధించిన త్యాగమూర్తి
మన దేశానికి స్వాతంత్య్రం కోసం పాటుపడిన నాయకుడు మహాత్మ గాంధీ అని, మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ, జాతిపితగా భారతీయులందరిచే ఆదరింపబడే స్వాతంత్రసమరయోధుడు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన మహాత్మాగాంధీ అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు…
అనంతరం గ్రామపంచాయతీ సిబ్బంది నరసింహ , కిషన్‌ , రమేష్‌ , కవిత , బిక్షం, యశోదలకి బేస్ట్‌ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వచ్ఛభారత్‌ లో భాగంగా చిరు సత్కారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్‌ , ఆర్యవైశ్య సంఘం గ్రామ అధ్యక్షులు దాచేపల్లి ఈశ్వరయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమిడి ఉపేందర్‌ జి , గణేష్‌ , గోపాల్‌ రెడ్డి , కృష్ణ , స్వర్ణలత , గ్రామ పెద్దలు కన్నెబోయిన జగన్‌ సోమేశ్వర్‌ రావు , చిల్ల శ్రీను , దాచేపల్లి మల్లయ్య , దేవేందర్‌ , బెస్ట్‌ సేవా సొసైటీ ఆర్గనైజర్‌ వేముల సైదులు, అంగన్వాడీ టీచర్స్‌ ఉమా , యశోద , సుధా , భాషకర్ల నరేందర్‌ రెడ్డి , అంకిరెడ్డి యాదయ్య , శివశంకర్‌ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking