గాంధీ పటానికి నిరసనతో వినతి పత్రం సమర్పణ

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 30 జనవరి 2025
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి మణికొండ పరిధి లోని పుప్పాలగూడ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నివాళులు అర్పించిన పిదప భారత రాష్ట్ర సమితి రాష్ర్ట నాయకత్వం పిలుపు మేరకు గాంధీ చిత్ర పటానికి ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై స్థానిక నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి వినతి పత్రం సమర్పించడ మైనదని అందులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తి చేసుకున్నను ఇచ్చిన 420 హామీలనేమో నెరవేర్చకుండా అటకెక్కించి, తూ తూ మంత్రంగా మొదలెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులేమో ఏం.ఎల్.సి ఎన్నికల పేరుతో తుస్సు బుస్సు అని పేలి పోతవనీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూన్నారని భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ జేసినారు, తదుపరి మణికొండ బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుట్టమీది నరేందర్ మరియు స్థానిక నాయకుల ఆద్వర్యంలో మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం తలపెట్టి ముందుకు సాగగా స్థానిక సమస్యలపై ప్రజలు స్పందించి పుప్పలగుడా బొడ్రాయి వద్ద మొదలుకొని ఊరగుట్ట నాగులమ్మ గుడి వరకూ ఇటీవలి డ్రైనేజీ కొరకు త్రవ్వకాలు జరిపించి రహదారి మరమ్మత్తులు గావించకుండా వదిలి వేయడం, అక్కడినుండి నల్లపోచమ్మ మందిరానికి వెళ్లే రహదారి గుంతల మయంగా ఉన్నదని, మందిరం ప్రక్కన ఉన్న చిన్న పాటి రహదారిలో ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన కరంట్ స్తంభం వేయడంతో పిల్లలకు పెద్దలకు అపాయం జరగ వచ్చని పలు సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు, ఎల్.ఐ.సి కాలనీ వద్ద ఇటీవల నామ మాత్రంగా రోడ్డు మరమ్మత్తులు గావించడం అట్టి రోడ్డు దుస్థితి చూపెట్టి భాదతో తమ వ్యధను ఏకరువు పెట్టినారు, ఈ సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగినది లేనియెడల ప్రజల సహకారంతో ఉద్యమం లేవనెత్తగలమని తెలియ పరుస్తూ, ఇట్టి కార్యక్రమంలో కుంబగళ్ళ ధనరాజ్, రూపా రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, ఏర్పుల శ్రీకాంత్, గుట్టమీది రాఘవేందర్, సంగం శ్రీకాంత్, ప్రకాష్, బండమీది మల్లేష్, మల్యాద్రి నాయుడు, శ్రీబాబు, ఉపేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం, యాలాల కిరణ్, సుమన్, దిలీప్, ప్రవీణ్, ఆరిఫ్ మహమ్మద్, శ్రీధర్, కృష్ణ రాజీ, సుమ నళిని, మధు చందన, తరుణ్, మహేష్, రవి సాగర్, మహేందర్, రాజు, రమేష్, షేక్ ఆరిఫ్ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking