ఛార్మీనార్ ప్రజాబలం ప్రతినిధి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారులు వేం నరేందర్ రెడ్డి షబ్బీర్ అలీ హర్కర వేణుగోపాల రావు , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , డీజీపీ జితేందర్ తో పాటు పలువురు ప్రముఖులు మహాత్ముడికి నివాళులు అర్పించారు.
