ఘనంగా మహాత్మ జ్యోతి పూలే జయంతి వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ భవనం నందు అంబేద్కర్ సంఘ మండలాధ్యక్షుడు దొంత నర్సయ్య ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196 వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.పూలే ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ…మహాత్మ జ్యోతి రావు బాబు పూలే సామాజిక ఉద్యమకారుడు,సంఘసంస్కర్త, బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు.సమాజంలో అనిచి వేతకు, ఆరాచకాలకు వ్యతిరేకంగా “సత్యశోధక సంస్థను” స్థాపించి దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప శక్తి అని అన్నారు. అంటరానితనానికి, వ్యతిరేకంగా విద్యావ్యాప్తికి, విశేష కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే ఆశయాల సాధన కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. జ్యోతిరావు పూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు తో సమచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,అవునూరి లచ్చన్న, చిప్పకుర్తి నారాయణ,లింగంపల్లి వెంకటేష్,లింగన్న,కిషన్, రాందాస్,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking