తూప్రాన్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

బహుజన త‌త్వ‌వేత్త ఫూలే “”
కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని కుల,లింగ వివక్షకు తావు లేకుండా, విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా ఫూలే ఆలోచన విధానాన్నే స్పూర్తిగామెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ తూప్రాన్ మున్సిపాలిటీ గజ్వేల్ నియోజకవర్గం ఘనంగా”” మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి”” వేడుకలు తూప్రాన్ లో బి.సి. బాలికల గురుకుల పాఠశాల లో బి.సీ.సంక్షేమ సంఘం , ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే మహనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ప్రతి ఒకరు పూలే ఆశయాలను కొనసాగించాలనిపిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మెదక్ జిల్లా బి. సి.సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్, ప్రిన్సిపల్ శోభాదేవి,రమ దేవి,జొస్న,ధనలక్ష్మీ,రాధ,మాధవి,సర్గల యాదగిరి,రమేశ్,నాగరాజ,నారాయణ,వెంకటేష్,బీమరి లింగం,దుర్గా స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking