సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి ని కలిసిన మైనంపల్లి హనుమంతరావు

మేడ్చెల్‌ ప్రజాబలం ప్రతినిధి:ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసినదే విడుదల ఆనంతరం కొంత మంది పార్టీ వీడడం పార్టీకీ దూరంగా ఉండటం జరుగుతున్నాయి.మేడ్చెల్‌ నియోజకవర్గంలో సీటు ఆశించి సీటురాని అభ్యర్థులు పార్టీకి దూరంగా ఉండటం గ్రహించిన కాంగ్రెస్‌ నాయకుడు మల్కాజీగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావ్‌
మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు నక్క ప్రభాకర్‌ గౌడ్‌ టికెట్‌ విషయమై అసంతృప్తితో ఉన్నప్పటికీ తోటి నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి కూడ అసంతృప్తితో ఉన్న విషయం తెలుసుకొని వారి నివాసానికి మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు ని తీస్కుని వెళ్లి చర్చించడం జరిగింది..
ఈ విషయమై సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది..
రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అందరికీ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఏ ఒక్కరూ అధైర్య పడవద్దు అని హనుమంతరావు పేర్కొన్నారు..నా పై నమ్మకంతో మేడ్చెల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి సహకరిస్తానని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసిన మైపంపల్లి హనుమంతరావు

Leave A Reply

Your email address will not be published.

Breaking