బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బహుజన బరోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో-2023 ను విడుదల చేశారు.
తెలంగాణ ప్రజలకు బీఎస్పీ 10 ప్రధాన హామీలు
1. కాన్షీ యువ సర్కార్:
యువతకు ఐదేళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు (అందులో మహిళలకు 5 లక్షల కొలువులు).
షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు.
2. పూలే విద్యా దీవెన:
మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్.
ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. Data, AI, మరియు కోడింగ్ లో శిక్షణ
3. బహుజన రైతు ధీమా:
ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు.
రైతులకు విత్తు నుండి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ.
ధరణి పోర్టల్ రద్దు
4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి:
మహిళా కార్మికులు మరియు రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, మరియు డ్రైవింగ్ శిక్షణ.
అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ.
మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష
5. భీం రక్షా కేంద్రాలు:
వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు.
6. బ్లూ జాబ్ కార్డ్:
పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ.
రోజూ కూలీ రూ. 350 కి పెంపు.
కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య మరియు జీవిత భీమా
7. నూరేళ్ళ ఆరోగ్య ధీమా:
ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజీ.
ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జె
8. వలస కార్మికుల సంక్షేమ నిధి:
5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు
వలస కార్మికులకు వసతి
గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు
9. షేక్ బందగీ గృహ భరోసా:
ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం
ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం
ఇంటి పునర్నిర్మాణానికి రూ.1 లక్ష సహాయం
10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు :
భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.
ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి 50 రోజుల పాటు 144 సెక్షన్
రేపటి నుంచి 50 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా తెలిపారు.
అక్టోబరు 18 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు మొత్తం 50 రోజుల పాటు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు
గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా ఎలక్షన్ కోడ్ ఉందని రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన రేవంత్ ,పోలీస్ లకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట
అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు