మెదక్ జిల్లా.మెదక్ – 10.02.2023. ప్రజా బలం న్యూస్మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శి ఐ.పి.ఎస్ గారి ఆదేశానుసారం మెదక్ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి తూప్రాన్ డి.ఎస్.పి.శ్రీ.యాదగిరి రెడ్డి , ఆర్.ఐ. శ్రీ. నాగేశ్వర్ రావు గారి ఆద్వర్యంలో సిబ్బంది చేసిన పి.టి. మరియు లాఠీ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంభించాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఈ పరేడ్ కార్యక్రమంలో రామాయంపేట సి.ఐ.శ్రీ.చంద్రశేఖర్ , తూప్రాన్ సి.ఐ.శ్రీ.శ్రీధర్ గారు,డి.సి.ఆర్.బి.సి.ఐ.శ్రీ.దిలీప్ గారు,ఆర్.ఎస్.ఐ లు మరియు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.