ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి పిలుపు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా… నిర్మల్ జిల్లా, మార్చి 02 :: భారత్ జోడో యాత్ర లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో సాయంత్రం మూడు గంటలకు హత్ సే హత్ జోడో యాత్ర కొనసాగుతుందని తెలిపారు అదేవిధంగా నాలుగు తేదీ. నిర్మల్ పట్టణంలో. ఐదో తేదీ లక్ష్మణ్ చందా మండలంలో. ఆరవ తేదీ మామడ మండలంలో చేసుకొని అక్కడ నుంచి ఖానాపూర్ మీదుగా. ఆదిలాబాద్ బోత్ నుంచి మంచిర్యాల వరకు..
దీనికి రాష్ట్ర కేంద్రం నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరు అవుతారని తెలిపారు,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా,మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలను తగ్గించాలని,భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూని ఐతున్నటువంటి తరుణంలో, నేనున్నానని భరోసా కల్పిస్తూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మద్దతుగా రాష్ట్ర నాయకత్వం మొత్తం పాదయాత్ర చేస్తున్నటువంటి సంగతి విధితమే,దేశంలో ప్రతి ఆర్థిక సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వన్ని గద్దె దించడానికి, రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలకు చర్మ గీతం పాడాలనే దృఢ సంకల్పతో సాయంత్రం ప్రారంభమయ్యే కాంగ్రెస్ పార్టీ పోరు యాత్రకు నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,పార్టీ సానుభూతిపరులు, యువకులు, కార్మికులు,విద్యార్థులు,నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు,