బహుజన మేధావి బూర నర్సయ్య గౌడ్

 

భువనగిరి పార్లమెంట్ మాజీ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ బహుజన మేధావని తెలంగాణ గౌడ కలుగుత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఆయన జన్మదినం పురస్కరించుకొని సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బూర నర్సయ్య గౌడ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సయ్య గౌడ్ పేద దళిత బహుజన ఐక్యత కోసం ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. బహుజన మేధావిగా గుర్తింపు పొంది ఆసియా ఖండంలో గొప్ప డాక్టర్ గా పేరు పొందారని కొనియాడారు. అణగారిన వర్గాలకు తన సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చౌగోని శ్రీనివాస్ గౌడ్ ,హరిశంకర్ గౌడ్ ,ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking