– బిఎస్పి చిట్యాల మండల అధ్యకురాలు
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నకిరేకల్ నియోజకవర్గం ఇన్చార్జి మేడి ప్రియదర్శిని పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత అన్నారు. ఆర్ఎస్పీ ,ప్రియదర్శిని పై రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ విమర్శించే స్థాయి నీదు కాదు అన్నారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది మీ పరిస్థితి అన్నారు.ఎమ్మెల్యే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య గురించి మాట్లాడిల్సిన పని లేదు? నీ భార్య గురించి ఆర్ఎస్పీ మాట్లాడినాడా ? నువ్వు ఎందుకు మాట్లాడుతునావు నకిరేకల్ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోతావు కాబట్టి ఇలాంటి విమర్శలు చేయిస్తునావు.రాజకీయాలలో అనుభవం లేకపోవచ్చు కాని ప్రజా సమస్యలపై అవగాహన వుంది. అందుకే ఒక్క రూపాయి ఇవ్వకున్నా జనాలు స్వచ్ఛందంగా మేడి ప్రియదర్శిని నాయకత్వంలో బిఎస్పీ ఆర్ఎస్పీ వైపు కదులుతున్నరు.మా అనుభవం ఏంటో రాబోయే ఎలక్షన్లో చూపిస్తాం అని అన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లి కాదు, పులి. తన మీద, తన కుటుంబం మీద, ప్రియదర్శిని మేడి, మీద చేసినటువంటి, చేపిచ్చినటువంటి ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.