వంటగ్యాస్ పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి ఎఫ్డిసి. చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

కేంద్ర ప్రభుత్వం నిరంతరం పేద ప్రజల యొక్క బతుకుతెరువును మనోభావాలను దెబ్బతీస్తూ అన్ని రంగాలలో నిత్యం వాడే వంటగ్యాసుపై వివిధ వస్తువుల పైన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని పేద వర్గాలకు చెందిన ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అభివృద్ధి సంస్థ చైర్మన్
వంటేరు ప్రతాపరెడ్డి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 కరీంగూడా చౌరస్తాలో ధర్నా సందర్భంగా దుయ్యబట్టారు.
గతంలో 400 ఉన్న సిలిండర్ను నేడు గమనించినట్లయితే 12 నుండి 1300 వరకు పెంచిన ఘనత బిజెపి పార్టీకే దక్కుతుందని దేశాన్ని భర్భత్ చేస్తున్నాడని దేశ ఆర్థిక వనరులను ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నాడని పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడని వారు పేర్కొంటూ ఎల్ఐసి ద్వారా 50వేల కోట్లు అధాని అంబానీలకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే యోచనలో ఉన్నారని దేశ ప్రజలు దీని గమనిస్తున్నారని వారి సందర్భంగా దుయ్యబడ్డారు. రాబోయే రోజుల్లో దేశానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అయితే దేశాన్ని వ్యవసాయ రంగంలో ప్రపంచంలో నెంబర్ వన్ దేశాన్ని చేస్తాడని దేశ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తున్నారని ధర్నా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక అద్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్,పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఉమ్మడి మండల ఎంపీ పిలు పురం నవనీత రవీ ముదిరాజ్, గడ్డి స్వప్నా వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్తా, రవీందర్ రెడ్డి, మామిండ్ల జ్యొతి క్రుష్ణ, తూప్రాన్ మండల బిఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్కాపురం ఆంజనేయులు గౌడ్, నాయకులు పౌడల పల్లి రమెష్, చంద్రారెడ్డి,దామెదర్ రెడ్డి, కిష్టారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్, శేఖర్ ముదిరాజ్, బురాన్ బాయ్ , రత్నపురం మహేష్ యాదవ్, జిడిపల్లి బాలకృష్ణ రఘుపతి, శ్రీకాంత్, యాసిన్, తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, మనోహరాబాద్ మండల సర్పంచులు, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, వివిధ గ్రామా ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking