కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడంతో బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ పిలుపు మేరకు స్థానిక ఎం ఎల్ ఏ ప్రకాష్ గౌడ్ ఆదేశాలతో ఈ రోజు మణికొండ మున్సిపాలిటీ, ఆంధ్ర బ్యాంక్ సర్కిల్లో పార్టీ నాయకులు నిరసనగా రోడ్ పై బైటాయించి కట్టెల పోయిపై వంట చేసి నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ పేద వాడి నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగించాలి అని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు వసంత్ రావు, ఆలస్యం నవీన్ కుమార్, బీఆర్ఎస్వీ నాయకుడు శ్రావణ్, మైనారిటీ నాయకుడు బషీర్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, జయరాజ్, లక్ష్మయ్య, శ్రీకాంత్, రాఘవేంద్ర, రాజేంద్ర ప్రసాద్, భరత్, గంగాధర్, ఏర్పుల కుమార్, సందీప్, దిలీప్, భాను, కిరణ్, ఆరిఫ్, రఫిక్, మహిళా నాయకురాల్లు విజయలక్ష్మీ, లత, శివగంగ, డాక్టర్ ప్రభావతి ఆదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.