దళిత బహుజనుల హక్కుల సాధనే లక్ష్యం

 

25 న పెగడపల్లిలో బహిరంగ సభ

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పేట భాస్కర్

జగిత్యాల, మార్చి 3: భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజలను చైతన్య పరిచేందుకు దళిత బహుజన హక్కుల సాధనే లక్ష్యంగా మార్చి 25 న పెగడపల్లి మండల కేంద్రం లో జగిత్యాల జిల్లా స్థాయి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పేట భాస్కర్ చెప్పారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఎవైఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అద్యక్షులు కొంగర పవన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తు రాజ్యాంగాన్ని ముట్టుకోకుండానే సములంగా మార్చే విదనాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూదని పేట భాస్కర్ ఆరోపించారు. దేశంలోని అన్ని మత గ్రంథాలకు మూలవిరాట్ లాంటి భారత రాజ్యాంగం ఉన్నతమైనదని దాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరుడిపై వుందని అందుకే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఈసభకు అన్ని కుల, ప్రజాసంఘాల నాయకులతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేట భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జగిత్యాల టిఎవైఎస్ జిల్లా అధ్యక్షులు కొంగర పవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాజయ్య, జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు కొడిపెల్లి సురేష్, మేడిపల్లి మండల అధ్యక్షులు బంగారు దీపక్, కోరుట్ల మండల టౌన్ అధ్యక్షులు జాగర్ల రాజయ్య, శనిగారపు రాజేష్, గొల్లపల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొత్తూరి రాజేశం, చెవులమద్ది సంతోష్, రెడపాక ఇంద్రన్న, నాయకులు నక్క గంగారాం, సిద్దెంకి అదామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking