_డా. ముప్పారం ప్రకాశం
సంగారెడ్డి మార్చి 03,( ప్రజ బలం ప్రతినిధి): పుల్కల్ మండలం ఇటికాల గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు రాధయ్య అల్మాయపేట ప్రాంతంలో నేషనల్ హైవే పక్కన ప్రారంభించిన రెస్టారెంట్ ను సందర్శించిన బిఎస్పి నాయకులు డా.ముప్పారం ప్రకాశం బహుజన కులాలు అన్ని రంగాల్లో రానించాలని, ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యాపార దృక్పథాన్ని అవలంబించుకోవాలని, అన్ని రకాల వ్యాపారాలలో రాణించాలని, భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బహుజన కులాలకు వ్యాపార రంగంలో పెద్ద పీఠవేయబడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రోప్రైటర్ రాధయ్య ని శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఎస్సి చౌట్కూరు మండల అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, వట్టిపల్లి మండల నాయకులు కిరణ్ కుమార్, అందోల్ జోగిపేట మున్సిపాలిటీ నాయకులు బి. ప్రసాద్, ఎస్.ఎస్.యు. నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.