ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో గూడెం లిఫ్ట్,కడెం కాలువ ద్వారా మంచిర్యాల నియోజకవర్గ రైతులకు సాగు నీరు అందక ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ లక్షెట్టిపేట ఐబీ గెస్ట్ హౌస్ లో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ….గూడెం లిఫ్ట్ నిర్మాణ టెండర్ లో ఎం ఎస్ పైపులు వాడాలని ఉన్నప్పటికీ అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ సాగర్ రావు,దివాకర్ రావు కాంట్రాక్టర్ మేఘ కంపెనీతో కుమ్మక్కు అయ్యి కమిషన్ల కోసం ఎంఎస్ పైపుల బదులు నాసిరకం జిఆర్ఈ పైపులు వేయడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ చేసిన పాపం వల్లనే ఇప్పుడు రైతుల పాలిట శాపం అయిందని అన్నారు. గూడెం లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయిన నాటి నుండి ఇప్పటి వరకు వందల సార్లు పైపులు పగిలిన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం,మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పట్టించుకోవడం లేదని అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మార్పుకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని త్వరలోనే పైపులు మారుస్తామని చెప్పిన కూడా ఇప్పటి వరకు కనీసం టెండర్లకు కూడా పిలువలేదని అన్నారు.గూడెం పైపుల మార్చాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవడంతో ఎమ్మెల్యే దివాకర్ రావు పూర్తిగా విఫలం చెందారని అన్నారు.సాగు నీరు అందక ఎండిపోయిన పంటలకు తక్షణమే ఎకరానికి 25 వేల రూపాయల నష్ట పరిహారం రైతులకు చెల్లించాలి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరమల్ల హారి గోపాల్,హేమంత్ రెడ్డి,తమ్మినేని శ్రీనివాస్,గుండా ప్రభాకర్,వేముల మధు,ముష్కం గంగన్న, శివ శంకర్,మోటపలుకుల సతీష్, శ్రీరామ్,గడికోప్పుల సత్తయ్య, బందేల రవి గౌడ్,ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.