గౌరవ అధ్యక్షులు మర్రి ప్రకాష్ అధ్యక్షులు దాసరి వీరబాబు
ఖమ్మం ప్రతినిధి జనవరి 30 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రగతిశీల మాల సమాఖ్య విద్యార్థి తెలంగాణ అధ్యక్షులు దాసరి వీరబాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో మాల జాతి అభ్యున్నతి కోసం , అస్తిత్వ , ఆత్మ గౌరవం కోసం చేసి ప్రయత్నంలో భాగంగా ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్య ఆవిర్భావ మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఖమ్మం నగరంలోనే బైపాస్ రోడ్డు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు . ఎన్నో రాజకీయ పార్టీలకు , కుల సంఘాలకు , విద్యార్థి విభాగాల యువజన విభాగాలు ఉన్నాయి , కానీ మాల జాతి ఔన్నత్యాన్ని గుర్తించడానికి , గౌరవించడానికి ఈ మన విద్యార్థి సంఘం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు . కావున స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ మెడికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ తదితర విద్యార్థి స్థాయిలో ఉన్న వారందరూ మరియు జాతి సోదరులు పెద్దలు రాజకీయ నాయకులు మేధావులు సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు . మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు , మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు ఐఏఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి , ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ , విద్యుత్ శాఖ ఛీఫ్ ఇంజనీర్ పిల్లి బాలరాజు బహుజన ప్రజా గాయకులు రెంజర్ల రాజేష్ సమత సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి డిగాంబర్ కాంబ్లీ , మహాసేన అధ్యక్షులు మహాసేన రాజేష్ , ఏఎంఎస్ఏ మందాల భాస్కర్ , మాలమహానాడు ప్రధాన కార్యదర్శి మంచాల వెంకటస్వామి పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మర్రి ప్రకాష్ , అధ్యక్షులు దాసరి వీరబాబు , ఉపాధ్యక్షులు గండమాల ప్రభాకర్ జాయింట్ డైరెక్టర్ పాలకుర్తి భాస్కర్ రావు జాయింట్ సెక్రెటరీ పనితి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు
