ద్రవ్య పదార్థాలు నిర్వహణపై అవగాహన

 

గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజాబలం ప్రతినిధి :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిషత్తు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం నాడు ఐటిసి సునేహ్రాకల్ వాష్-ఐ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషాద్రి గారు, ఎంపీఓ సతీష్ గారు అదేవిధంగా గ్రామపంచాయతీ సెక్రటరీలు,ఎంపీడబ్ల్యు వర్కర్లు మొదలగున వారికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సమావేశంలో ఎంపీడీవో శేషాద్రి గారు మాట్లాడుతు ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచడంలో ఆచరణాత్మక ప్రయోజనాలను వివరించడం జరిగింది.అదేవిధంగా పంచాయతీ కార్మికులు మరియు పారిశుధ్య కార్మికులు ఈ పద్ధతుల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడంలో కీలకమైన పాత్ర పోషించాలని వారికి ఎంపీడీవో గారు సూచించడం జరిగింది అక్రమ మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను పారవేయడం, కాల్చడం ద్వారా పర్యావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అలాగే దీని ద్వారా గాలి, నీరు, నేల కలుషితం అవుతుందని వారు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీఓ సతీష్ గారు ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణపై మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఐటీసీ వాష్ స్వచ్ఛంద సంస్థ యొక్క ప్రతినిధులు అయిన ఏపీవో బి.జనార్దన్ గారు, కమ్యూనిటీ మొబిలైజర్ ఆర్.మల్లేష్ గారు, మరియు హైజిన్ ఎడ్యుకేటర్ ఎం.మహేష్ గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశం లో కమ్యూనిటీ మొబిలైజర్ మల్లేశం గారు ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణపై సమావేశానికి విచ్చేసిన గ్రామపంచాయతీ సెక్రటరీలకు మరియు ఎంపీడబ్ల్యు వర్కర్స్ కి అవగాహన కల్పించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking