– పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు.
– కులగణన చరిత్రలో ఒక మైలురాయి.
– పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపించాం.
కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 2
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కులగణన సర్వే ఒక బృహత్తర కార్యక్రమమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మానకొండూర్ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి భవిష్యత్తును నిర్ణయించేవని ఇందుకు ముందుగా ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేను ప్రతి ఒక్కరూ పాల్గొనేలాగా అందరూ కృషి చేయాలని కోరారు.ఈ సర్వే పట్ల అవగాహన లేని నాయకులు ఊర్లో పెళ్లికి కుక్కల హడవిడిలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సంబంధం లేని విషయాలకు ముడి పెట్టుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో చేసి చూపెట్టమని ఇది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్,సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేష్,మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.