మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 2:
మందమర్రి పట్టణంలోని రెండవ జోన్ లో గల పోస్ట్ ఆఫీస్ ను శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని దాని నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయించేలా అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. మందమర్రి రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరగా దానికి అనుకూలంగా స్పందించి వెంటనే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచిస్తానని తెలిపారు.