ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.గురువారం ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత,దోమలు పుట్టకుండా,దోమలు కుట్టకుండా ప్రతి వారానికి ఒక రోజు శుక్రవారం చేపట్టవలసిన డ్రై డే ప్రాముఖ్యత గురించి,ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్,హెచ్ ఈ ఓ లక్మణ్ స్వామి,హెల్త్ సూపర్ వైజర్ మార్త,ఫార్మాసిస్ట్ సునీత, ఎంఎల్ హెచ్ పీలు,హెల్త్ అసిస్టెంట్లు యం.ఏ.గఫూర్, వేణు,ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎంలు ఆశావర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.