కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గెలుపు కోసం గడప గడపకు కాంగ్రెస్ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గెలుపు కోసం గడప గడపకు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ అధ్యక్షుడు నవాబ్ ఖాన్,గుత్తికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గుర్తు చేయి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ కృష్ణ ని గెలిపించాలని అందరిని కోరడం జరిగింది.అంతేకాకుండా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని మన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లడానికి వాళ్లు చెప్పిన సమస్యలను రాసుకొని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే దిశ గురువారం కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో నాయకులు మినుముల శాంతి కుమార్,గరిసె రవి,అయూబ్,అజ్జూ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking