సోషల్‌ మీడియాలో పోస్టులపై రామగుండము కమీషనరేట్ పోలీసుల నిఘా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలుకే‌

 

పోలీస్ కమీషనర్ ఐపిఎస్(ఐజీ)ఎం శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ పోలీస్ కమీషనర్ ఐపిఎస్(ఐజీ)ఎం శ్రీనివాస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంబించడం జరిగింది. గురువారం ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…ట్విటర్‌, ఫేస్‌బుక్‌,వాట్సాప్‌,ఇతర సోషల్‌ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకుని కొందరు,ఓమతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్‌గా చేసుకుని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్‌ చేసినా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటున్నారు.అలాంటి వారికి జైలు శిక్ష,జరిమానా తోపాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా.సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేముందు,వచ్చిన పోస్టులను ఫార్వర్డ్‌ చేసేముందు అవి నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.24*7 నిరంతరం  సోషల్‌ మీడియా పోస్ట్ లపై  నిరంతరం నిఘా ఉంటుంది. మత ఘర్షణల కలిగేలాగా,లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా,సోషల్ మీడియాలో మతాలను, కులాలను,ఒకరినొకరు కించపరుస్తూ గాని,లేనిపోని అబద్దపు పుకార్లను సృష్టించి  ఎవరైనా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే వారిపై సోషల్ మీడియా మానిటరింగ్  సెల్ నిఘా ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking