హైదరాబాద్ జూన్ 22 (); రంగారెడ్డి జిల్లా బిసి విద్యార్ధి సంఘం ఉపాధ్యక్షులు గా కుమ్మరి మల్లేష్ నియమితులైనారు. ఈమేరకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఎంపి ఆర్. కృష్ణయ్య చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ కు చెందిన మల్లేష్ విద్యార్ధి ఉద్యమాల్లో చురుకైన పాత్రని నిర్వహిస్తున్నారు. అతని విద్యార్ధి ప్రతిమను గుర్తించిన ఆర్. కృష్ణయ్య అతన్ని రంగారెడ్డి జిల్లా బిసి విద్యార్ధి సంఘం ఉపాధ్యక్షులు గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసారు.అనంతరం కుమ్మరి మల్లేష్ మాట్లాడుతూ నేడు రాష్ట్రము లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు స్కాలర్ షిప్లు , మెస్ చార్జీల పెంపు, మొదలగు సమస్యల పై పోరాటం చేస్తామని చెప్పారు. తన నియామకానికి సహక రించిన బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వేముల వెంకటేష్, రాష్ట్ర అద్యక్షులు ఎర్ర సత్యనారాయణకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కురిమిల్ల నర్సిమంహ గౌడ్, నీలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.